ప్రజాగళం నిజామాబాద్ ప్రతినిధి:
కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్పీ గంగాధర్ కు ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని
తెలంగాణ రాష్ట్ర
సంచార జాతుల సంఘం రాష్ట్ర
అద్యక్షులు తిపిరి శెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సింగజ్యోగి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం సంచార జాతుల జిల్లా అధ్యక్షులు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ద్యా రంగుల నాగేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా
తెలంగాణ రాష్ట్ర
సంచార జాతుల సంఘం రాష్ట్ర
అద్యక్షులు తిపిరి శెట్టి శ్రీనివాస్,
ప్రధాన కార్యదర్శి సింగజ్యోగి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రం లో బీసీలు 52 కులాలు,12 శాతం జనాభా, ఎస్ సి లు 10 కులాలు ఎస్సీ జనాభా లో 20 శాతం, ఎస్టీ లు 4 కులాలు, ఎస్టీ లలో 10 శాతం జనాభా, మైనారిటీ 14 కులాలు బీసీ కులాల్లో సంచార జాతులుగా ఉన్నాయని అన్నారు. మా సంచార జాతుల నుంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించి మా జాతుల కోసం పోరాటం చేస్తూ ఎన్నో సేవలు అందించిన డీఎస్పీ మదనం గంగాధర్ కు మా పూర్తి మద్దతు తెలుపుతున్నానని అన్నారు.
అరు ఎమ్మెల్సీ లలో మాకు రిజర్వేషన్ ఇవ్వకున్న విద్య వేత్త, ఉద్యోగానికి వి ఆర్ ఎస్ తీసుకొని పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థిగా ముందుకు వస్తున్నారని. ప్రభుత్వం అండగా నిలిచి ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు. ఎమ్మెల్సీ స్థానాలలో వాటిని మాకు కేటాయించాలని కోరుతున్నామన్నారు. సంచార జీవిగా బాల కార్మికుడిగా న్యూస్ పేపర్ బాయ్ గా, విద్యార్థి నాయకుడిగా క్రీడాకారుడిగా పోలీస్ అధికారిగా ప్రజారక్షకుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి రాజకీయంగా పట్టభద్రులకు న్యాయం చేయాలని సంకల్పంతో ముందుకు వస్తున్న డీఎస్పీ గంగాధర్ను గెలిపించాలన్నారు. కష్టాలు తెలిసిన వ్యక్తిని గెలిపిస్తే ప్రజా గొంతుకై ప్రజలకు సేవలందిస్తారన్నారు. ఈ సమావేశంలో ఎస్. బీమ్ రాజ్,
వేముల రఘు, బత్తుల నాగేష్, ఓల్లేపు గంగాధర్,
బీదండ్ల గంగారం, తిమ్మయ్య, కుమార్, కుంచేపు ఆనంద్, పల్లపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

