ఉత్సాహంగా జర్నలిస్టుల క్రేడలు. జర్నలిస్ట్ ల క్రికెట్ టోర్నమెంట్ లో ఇందూరు లెవెన్ విజయం.

నిజామాబాద్ జనవరి 22 (ప్రజా గళం ):

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ పోటీల్లో ఇందూర్ లెవెన్ జట్టు విజయం సాధించింది. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో బుధవారం నిర్వహించిన క్రికెట్ పోటీలను డిసిపి( అడ్మిన్) బస్వా రెడ్డి బాపూజీ వచనాలయం చైర్మన్ భక్తవత్సలం (ఢిల్లీ) హాజరై ప్రారంభించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇందూర్ లెవెన్ జట్టు 16 నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి మొత్తం 131 పరుగులు చేశారు. 132 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నిజామాబాద్ లెవెన్ జట్టు 16 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 86 పరుగులు చేసి ఓటమి చెందారు.

Leave A Reply

Your email address will not be published.