ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్ ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

 

నిజామాబాద్ క్రైమ్, జూన్ 11(ప్రజాగళం)

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలను ఆపి బైకులకు సంబంధించిన కాగితలను చూపించమనగా బైకు పత్రాలు చూపించలేక పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పట్టుకుని విచారించగా వాహనాల దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. నిజామాబాద్ ఏసీపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపి రాజా వెంకటరెడ్డి, టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి లు మాట్లాడుతూ బోధన్ పట్టణానికి చెందిన మాలోత్ రమేష్, కటం రవి లు ఇద్దరు కలిసి బాసర్ రైల్వేస్టేషన్లో ఒక బైకు, తిర్మన్ పల్లి గ్రామంలో ఒక బైకు, వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఒకటి, నిజామాబాద్ పట్టణంలో మూడు బైకులను దొంగిలించామని ఒప్పుకున్నట్లు తెలిపారు. దొంగతనం చేసిన బైకులను సమయం చూసి అమ్ముకుందామని ఒకచోట దాచిపెట్టగా పోలీసులు వాటిని స్వాధీనపరుచుకున్నారు. వీరు గతంలో బైక్ దొంగతనాలు చేసి జైలుకు పోయి వచ్చినా గాని ఎలాంటి మార్పు రాలేదని ఏసిపి రాజా వెంకట్ రెడ్డి అన్నారు. ఇద్దరు నేరస్తులపై ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.