రౌడీ షీటర్ బర్సాత్ అమెర్ గ్యాంగ్ సబ్యుడు ఇర్ఫాస్ అరెస్ట్. -ఒక తల్వార్, రెండు కత్తులు, రెండు చేతి పంచ్ లు 50గ్రాముల గంజాయి పట్టివేత.

 

నిజామాబాద్ క్రైమ్, జూన్ 11( ప్రజాగళం)

నగరంలో ఒక వ్యక్తి గంజాయి అమ్ముటకు ఫ్రూట్ మార్కెట్ వస్తున్నాడు, అనే సమాచారంతో నిజామాబాదు వన్ టౌన్ పోలీస్ లు అక్కడికి వెళ్లి కాపు కాసి అ వ్యక్తిని చూసి పట్టుకునే ప్రయత్నం చేయగా అతను పారిపోవుటకు ప్రయత్నించడంతో అతన్ని పోలీసు లు వెంబడించి పట్టుకున్నారని ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. గురువారం ఎసిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని బాబా నగర్ కు చెందిన షేక్ ఇర్ఫాన్ క్యాటరింగ్ పని చేస్తూ బర్సాత్ అమెర్ రౌడీ షీటర్ గ్యాంగ్ లో సబ్యుడుగా కొనసాగుతున్నాడు అన్నారు. షేక్ ఇర్ఫాన్ గంజాయి అమ్మడానికి ఫ్రూట్ మార్కెట్ కి వచ్చి ఎవరైనా అడ్డు వస్తే తనతో తెచ్చుకున్నటువంటి కత్తితో వాళ్ళ మీద అటాక్ చేసి గాయపరచాలని ఉద్దేశంతో చాకుని కూడా క్యారీ చేస్తున్నట్టుగా నేరం ఒప్పుకున్నాడన్నాడు. పంచుల ముందట 50 గ్రాముల గంజాయిని, కత్తిని స్వాధీన పరచుకొని విచారించగా తాను ఇంతకుముందు బర్సాత్ ఆమేర్ అనే రౌడీషీటర్ తో పాటు కాలు దాదా, జసిన్, ముద్దస్సిర్, శేహబాజ్. జునైద్, సర్ఫరాజ్, లాల, యాసర్, సల్మాన్, సుల్తాన్, ఫర్హాన్, దానిష్ లు మరి కొంతమంది కలిసి ఈ నెల 7 వ తేదీ రాత్రి 01.15 గంటల సమయంలో బోధన్ రోడ్డు సవేరా హోటల్. వద్ద అటుగా వస్తున్న ఆటో రిక్షా ను ఆపి తమ వద్ద ఉన్న కత్తులను చూపించి,పంచ్ లతో కొట్టి బెదిరించి అతని వద్ద నుండి 400/- రూపాయలను లాక్కున్నారన్నారు. అలాగే అతని వద్ద నుండి సెల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించగా, అతను వారికి ఎదురు తిరగగా, వారితో తెచ్చుకున్న పంచ్ లతో అతని మొఖం పైన, వీపు పైన కొట్టి గాయపర్చారన్నారు, అదే సమయంలో అక్కడికి పోలీసులు రావడంతో అక్కడినుండి పారిపోయారన్నారు. అదే రోజు సాయత్రం 7.30 గంటల సమయంలో ఇర్ఫాన్ అసద్ బాబ నగర్ వద్ద నుండి ఆటో నగర్ వైపు బైక్ పైన వెళ్తుండగా, అక్కడే విదులు నిర్వహిస్తున్న పోలీసులు అతన్ని ఆపుటకు ప్రయత్నించగా తనతో తెచ్చుకున్న కత్తితో పోలీస్ పై దాడి చేసి పారిపోయాడాన్నాడు.

Leave A Reply

Your email address will not be published.