నిజామాబాద్ సెప్టెంబర్ 21 ( ప్రజాగళం ప్రతినిధి ) :
జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పాఠశాల ఉపాధ్యాయుడు కాపీ కొడుతున్న విద్యార్థిని మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఎనిమిదవ తరగతి విద్యార్థి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఎఫ్ఏ (2) పరీక్షల్లో కాపీ కోడుతూ పట్టుబడిన విద్యార్థిని పాఠశాల కరెస్పాండెంట్ మందలించడంతో పాటు ఈ విషయాన్ని వెంటనే విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో సీరియస్ గా పరిగణించిన విద్యార్థి తల్లిదండ్రులు తన కొడుకుని ఫోన్లో మందలించారు. తీవ్ర మనస్థాపానికి గురైన ఎనిమిదవ తరగతి విద్యార్థి పాఠశాల భవనం మూడవ అంతస్తు పైనుండి కిందకు దూకాడు. వెంటనే ఆ విద్యార్థిని ఓ ప్రెవేట్ హాస్పిటల్ కి తరలించారు.ఈ సంఘటన గత శుక్రవారం చోటు చేసుకోగా పాఠశాల యజమాన్యం ఈ విషయాన్ని బయటకు పోక్కకుండా గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం బాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మూడవ అంతస్తు నుండి కిందికి దూకడంతో విద్యార్థి కాలు విరిగిపోగా, తలకు, ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి.అతని పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఐసీయూలో బాబుకు రహస్యంగా చికిత్స అందిస్తున్నారు.ఈ విషయమై సంబంధిత పోలీసులను వివరణ కోరగా విద్యార్థి ఆత్మహత్యయత్నం చేసిన విషయం వాస్తవమేనని, దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు వెల్లడించారు. దీనిపై మరోసారి విచారణ జరుపుతామని చెప్పడం పోలీసుల తీరుపై అనుమానాలకు తావు కల్పి స్తుంది. పాఠశాల యజమాన్యాన్ని కాపాడేందుకే విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం పై పోలీసులు సీరియస్గా పరిగణించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి..

