నిజామాబాద్ క్రైమ్ జూన్ 21 ( ప్రజా గళం )
పలు రైళ్లలో మొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి వెల్లడించారు.. అతని వద్ద నుండి చోరీలకు సంబంధించిన 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ద్వారకా నగర్ కు చెందిన సయ్యద్ మజీద్ అనే వ్యక్తి నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో శనివారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తుండగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. అతన్ని విచారించగా నాగర్సోల్ షిరిడి సాయి నగర్ రైలు లో మొబైల్ దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడించారని తెలిపారు. చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సాయి రెడ్డి వెల్లడించారు. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న సయ్యద్ మజీద్ ను చాకచక్యంగా పట్టుకున్న రైల్వే పోలీసులు సురేందర్ గౌడ్, గురుదాస్, రాములను ఎస్ఐ అభినందించారు.

