బాన్సువాడ రూరల్, ప్రజాగళం, డిసెంబర్ 12:
బాన్సువాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మంత్రి అంజవ్వ గణేష్ ను నియమిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన మంత్రి అంజవ్వ గణేష్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉన్నారు. ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం గణేష్ సతీమణి అంజవ్వకు చైర్మన్ పదవి కట్టబెట్టింది.చైర్మన్ తో పాటు, సభ్యులను కూడా నియమిస్తూ జీవో విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి గణేష్ హర్ష వ్యక్తం చేశారు. వీరి నియమానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్ శ్రీ మహేష్ కుమార్ గౌడ్, వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు, జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ షట్కార్, మాజీ శాసనసభ్యులు బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి,సమస్త కాంగ్రెస్ సీనియర్ నాయకులకి ధన్యవాదాలు తెలిపారు.

