*విద్యార్థులకు చేయూతగా గ్రంధాలయ సంస్థలు* *జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి*

నిజామాబాద్ /బోధన్ (ప్రజాగళం) విద్యార్థులకు చేయూతగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు చేయూతగా గ్రంథాలయ సంస్థలు కాంపిటీషన్ బుక్స్, స్టడీ మెటీరియల్ లైబ్రరీల ద్వారా అందుబాటులో ఉంచు తున్నట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి తెలిపారు. గురువారం బోధనలోని గ్రంథాలయాన్ని సందర్శించి మాట్లాడారు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ఆహారం కూడా అందిస్తున్నామని తెలిపారు. గ్రంథాలయాలను డిజిటల్ సేవలందించే విధంగా కృషి జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు పోటీ పరీక్షలు రాసేవారికి ఎలాంటి ఆపోహలు అవసరం లేదన్నారు నిర్భయంగా గ్రంథాలయాల కొచ్చి చదువుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శరత్ రెడ్డి, లైబ్రరియన్, ఎన్ శ్రవణ్, సందీప్, రమాదేవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి నవీన్, ప్రమోద్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.