కాంగ్రెస్ భవన్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు. ఆందోళనకారుల అరెస్టు.

నిజామాబాద్ జనవరి 8 (ప్రజాగళం)

హైదరాబాద్లో రాష్ట్ర బిజెపి కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ నిజామాబాద్ లో కాంగ్రెస్ కార్యాలయంపై ముట్టడికి ప్రయత్నించారు. నిజామాబాద్ నగర బిజెపి ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ కార్యాలయం ని ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరారు. అప్పటికే కాంగ్రెస్ ఆఫీస్ వద్ద భారీగా మోహరించిన పోలీసు బలగాలు కాంగ్రెస్ కార్యాలయం కు సమీప దూరంలో అడ్డుకుని వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బిజెపి కార్యకర్తలు నినాదాలు చేశారు. బిజెపి నేత రమేష్ బీదూరి ఎంపీ ప్రియాంక గాంధీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్లో బిజెపి కార్యాలయం పై మంగళవారం రాళ్ళ దాడి జరిగడంతో . నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బిజెపి ప్రయత్నించగా పోలీసులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.