నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్):
వాసవి క్లబ్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో స్థానిక బర్కత్పుర పాఠశాలలోని పిల్లలకు రంగుల పోటీలు నిర్వహించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు కృపాల్ సింగ్ తెలిపారు. ఈ పోటీలలో 24 మంది బాలికలు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి అలరించారు. అందమైన ముగ్గులకు వాసవి క్లబ్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ బహుమతులను అందజేశారు. బాలురకు గాలిపటాలు వితరణ చేశారు. విద్యార్థులకు గాలిపటాల పోటీలు నిర్వహించి అందులో ఉపాధ్యాయులు భాగస్వాములై ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకున్నారు. ప్రధానోపాధ్యాయులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టత మరియు గాలిపటం లో ఎగుర వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు తెలిపారు.

విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి మరియు ప్రోత్సాహo ఇవ్వడానికి పోటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఆఫ్ సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చెన్న రవీంద్రనాథ్, సెక్రటరీ చింతల బైరయ్య మరియు పాఠశాల సిబ్బంది జోష్న సుచిత్ర ,హర్షిదా ఫిర్దోస్, వింధ్య తాయి ఆనంద్ దిలీపులు పాల్గొన్నారు.

