హైదరాబాద్ జనవరి 9: బ్యూరో (ప్రజా గళం)
ఛత్తీస్గఢ్ లో మరోసారి ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో బీజాపూర్ సరిహద్దు వద్ద భద్రతా బలగాలు నక్సలైట్ల కు మధ్య గురువారం ఎదురుకాల్పులు జరిగాయి .
భద్రతా సిబ్బంది గురువారం ఉదయం సుక్మా- బీజాపూర్ సరిహద్దులోని అటవీప్రాంతంలో నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ ఘటన జరిగింది.
ఈ ఘటనలో ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగు తున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చావన్ తెలిపారు..
