ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో మాజీ నుడా చైర్మన్ భార్య పేరు. అధికారుల నిర్లక్ష్యంపై బిజెపి, కాంగ్రెస్ నిరసన.

నిజామాబాద్ జనవరి 22( ప్రజా గళం ప్రతినిధి)

 

నలుగురు నవ్విపోదురు గాక నాకేంటి అన్న చందంగా తయారయ్యింది ఇందిరమ్మ ఇండ్ల జాబితా. ఏకంగా గిత్త బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో నుడా చైర్మన్ గా వ్యవహరించిన ప్రభాకర్ రెడ్డి భార్య పేరు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో చేరడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువు పెద్దగా నిలిచింది. ప్రభాకర్ రెడ్డి భార్య విశాల్ ని రెడ్డి గతంలో కార్పొరేటర్ గా పనిచేసి ఖరీదైన భవనంలో నివాసం ఉంటున్నారు. కానీ అధికారులు సేకరించిన సర్వేలో విశాల్ ని రెడ్డి రేకుల షెడ్డులో ఉంటున్నట్లు అధికారులు రికార్డులు పొందుపరచడం ప్రస్తుతం చర్చనీయాoశంగా మారింది. అధికారులు తయారుచేసిన జాబితా బహిర్గతం కావడంతో బిజెపి కాంగ్రెస్ నాయకులు అధికార తీరని నివసిస్తూ బుధవారం ఆందోళనకు దిగారు. నిరుపేదలకు అందాల్సిన ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ పక్కా దారి పట్టడం అధికారుల నిర్లక్ష్యాన్ని మరోసారి బహిర్గతం చేసింది.

Leave A Reply

Your email address will not be published.