నిజామాబాద్ జనవరి 26:(ప్రజా గళం రూరల్):
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 240 కి పైగా కార్యాలయాలను అనుసంధానం చేస్తూ వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టరేట్‌ను డివిజనల్ మరియు ఇతర జిల్లా కార్యాలయాలకు అనుసంధానించే ప్రైవేట్ సురక్షిత నెట్‌వర్క్‌ను పర్యవేక్షించడం, ట్రబుల్షూటింగ్ నిర్వహించడంలో సయ్యద్ మొహతాసిమ్ టీఎస్ డబ్ల్యూఏఎన్ డి హెచ్ క్యూ నెట్వర్క్ ఇంజనీర్. తెలంగాణ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ జాతీయ ఇ-గవర్నెన్స్ ప్లాన్ కింద ప్రధాన మౌలిక సదుపాయాల భాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. 76వ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు.

