నిజామాబాద్ జనవరి 29 ( ప్రజా గళo ప్రతినిధి).
జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో అటెండర్ గా
పనిచేస్తున్నా ఖాజా మీయాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నుడా చైర్మన్ కేశవేణు హామీ ఇచ్చారు. ప్రజాగళంలో ప్రచురితమైన కథనానికి స్పందించి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అటెండర్ ఖాజా మీయా నుండి బుధవారం దరఖాస్తు స్వీకరించారు.
నిరుపేదలకు సొంతింటి కల తీరుస్తామంటూ ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రతి ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్ధానాలుచేసే కాంగ్రెస్ పార్టీ తన సొంత కార్యాలయంలో గత 50 ఏళ్లుగా పనిచేస్తున్ననిరుపేద షేక్ ఖాజా మియా తనకూ ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ప్రజా గళం పత్రికలో మంగళవారం కథనం ప్రచురితమైన విషయం విధితమే. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం సందర్భంగా పలువురు విలేకరుల ఎదుట పార్టీ కార్యాలయంలో పనిచేసే ఖాజా మియా తనకు సొంత ఇళ్లు లేదని తన గోడు వెల్లబోసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దాదాపు 50 ఏళ్ల నుంచి పనిచేస్తున్న షేక్ ఖాజా మియా తాను ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పటినుండి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నానని , తనకు ఇద్దరు కూతుర్లు, ముగ్గురు కుమారులు ఉన్నారని, సొంత ఇళ్లు లేక నిజామాబాద్ పట్టణంలో అద్దెకు ఉంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అనేకమంది పార్టీ నాయకులను కలిసి విన్నవించిన పట్టించుకోలేదని ఆరోపించారు. అయితే ప్రస్తుత నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నుడా చైర్మన్ గా నియమితులైన కేశ వేణు తన దీనావస్థను చూసి స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారని ఖాజా మియా హర్షం వ్యక్తం చేశారు. తన సొంత ఇంటి కల నెరవేరితే నా కుటుంబం మొత్తం కేశ వేణుకు జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అటెండర్ ఖాజామీయా తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.

