బాన్సువాడ, ప్రజా గళం:
ప్రస్తుతం సన్నబియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయి షాక్ కు గురి చేస్తున్నాయి. మార్కెట్ లో రోజురోజుకూ పెరుగుతున్న సన్నబియ్యం ధరలు చూస్తుంటే సామాన్య ప్రజలు కొనుక్కుని తినలేని పరిస్థితి ఏర్పడింది. దొడ్డు బియ్యం తినలేని వారు రేషన్షాపులనుండి దొడ్డు బియ్యం తీసుకెళ్లి వాటిని అమ్మి దానికి బదులుగా సన్నబియ్యం
కొంటున్నారు. ఆ పరిస్థితి కూడా లేనివారు దొడ్డు బియ్యం వండుకుని తినే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పనుంది. ఈ ఏడాది ఉగాది పండుగ నుండి రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అదే జరిగితే పేద, మధ్యతరగతి ప్రజలు డబ్బులు పట్టి మార్కెట్లో సన్నబియ్యం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. ఇది ఇలావుంటే కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎం ఎల్ సి ఫలితాల అనంతరం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.

