పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే తోట దంపతులు.

మద్నూర్, ఫిబ్రవరి 27, ప్రజా గళం. మహా శివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన కాశీ విశ్వనాథ మఠంలో మఠాదిపతి శ్రీ సోమాయప్ప స్వామి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు సతీ సమేతంగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారి సతీమణి శ్రీమతి తోట అర్చన గారు శివుడికి అభిషేకం చేశారు.అశేషంగా తరలి వచ్చిన భక్తుల మధ్య మఠాదిపతి సోమాయప్ప స్వామితో కలిసి మఠంలో ఏర్పాటు చేసిన భక్తి సాంస్కృతికభజనకార్యక్రమాలను ఆధ్యాత్మిక చింతనతో తిలకిస్తూ జాగారం చేశారు.మఠాదిపతి శ్రీ సోమాయప్ప స్వామి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులను శాలువాతో సత్కరించారు.ఎమ్మెల్యే ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు..

పరమేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.