మానవత్వం చాటుకున్న ద్రోణవల్లి సతీష్.

బాన్సువాడ, మార్చ్ 5, ప్రజాగళం. బీర్కూర్ మాజీ జడ్పిటిసి సభ్యులు ద్రోణవల్లి సతీష్ మానవత్వం చాటుతున్నారు. పేద ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు వారిని ఆదుకునేందుకు సతీష్ ముందు వరుసలో ఉంటారు. ఇటీవల బీర్కూరు మండల కేంద్రంలో విద్యుదాఘాతంతో మూడు పెంకుటిల్లు దగ్ధమైన బాధితులకు మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ బుధవారం ఆర్థిక సహాయం అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 వేలు, మూడు కుటుంబాలకు 15వేలు,50 కిలోల బియ్యం అందించి వారికి ఆసరా అయ్యారు.

ఇల్లు నిర్మించుకుంటే తనవంతుగా ఆర్థిక సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా చందా అనే ట్రాక్టర్ డ్రైవర్ పక్షవాతానికి గురి అయనట్లు తెలుసుకొని ఆయనకు కూడా 5వేలు అందించారు. ఈ కార్యక్రమంలో నారాయణ, మేకల రాములు, మొగులయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.