ప్రపంచంలో అతిపెద్దసేవా సంస్థలలో ఒకటి రోటరీ 3150 గవర్నర్ శరత్ చౌదరి

 

హైదరాబాద్ (ప్రజాగళం అర్బన్):

ప్రపంచంలోకెల్లా రోటరీ అతిపెద్ద సేవా సంస్థలలో ఒకటని 3150 గవర్నర్ శరత్ చౌదరి అన్నారు. హైదరాబాదులో SNR పుష్ప కన్వెన్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన వార్షిక సమావేశ సభను ఉద్దేశించి మాట్లాడారు. రోటరీ సంస్థ యొక్క లక్ష్యం ఇతరులకు సేవలను అందించడం సమగ్రతను ప్రోత్సహించడం అని అన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ అనేది రోటరీ జిల్లాలో నిర్వహించబడే వార్షిక కార్యక్రమం, ఇది రోటరీ సభ్యులను నెట్ వర్క్ ను ఒకచోట చేర్చి విజయాలను జరుపుకోవడం, రోటరీ మరియు జిల్లా కార్యకలపాల గురించి తెలుసుకోవడం, ఫెలోషిప్ ను పెంపొందించడం సభ్యులు సేవ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడాన్ని ప్రేరపించడం, జిల్లాలోని వివిధ క్లబ్ ల నుండి రొటీరియన్లు ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి ఇది అవకాశాలను కల్పిస్తుందన్నారు.

నిజామాబాద్ నుండి 35 మంది ఈ వార్షిక సమావేశానికి పాల్గొనడం జరిగిందని రోటరీ జిల్లా అధ్యక్షులు బీరెల్లి విజయ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు, ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత శ్యామ్ కాసర్ల, ఆహ్లాదకరమైన సాయంకాలాన్ని సినీ గాయకుడు మిర్యాల రామ్ బృందం ఏర్పాటు చేసిన సంగీత గాన లహరి సభ్యులలో ఎంతో ఉత్సాహాన్ని రేపిందన్నారు. రోటరీ జిల్లా 3150 పరిధిలో 25 సంవత్సరాలకు పైగా సేవ చేస్తున్నా వారిని బంగారు పథకంతో సత్కరించడం జరిగిందన్నారు. నిజామాబాద్ క్లబ్ తరఫున 6గురు ప్రతి పురస్కారాన్ని అందుకోవడం గర్వించదగ్గ విషయం అన్నారు. రోటరీ అంతర్జాతీయ ప్రతినిధి డానియల్ పాల్గొని సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గంగారెడ్డి, పి డి జి గౌతమ్, డాక్టర్ పి.బి కృష్ణమూర్తి, డి నరసింహ రెడ్డి, ఎల్ గోపాల్ రెడ్డి, ఆకుల అశోక్, చిలక ప్రకాష్, జ్ఞాన ప్రకాష్, జితేంద్ర మలాని, దర్శన్ సింగ్ సోకి, ఆర్ జగదీశ్వరరావు తదితరులు అత్యధిక సంఖ్యలో పాల్గొని సభ విజయానికి కారకులుగా నిలిచారని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.