అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్న స్కూళ్లపై తక్షణం చర్యలు తీసుకోవాలి డీఈఓ కు వినతి పత్రం అందజేసిన ఏ ఐ ఎస్ ఎ జిల్లా కార్యదర్శి జ్వాల.

 

ప్రజా గళం నిజామాబాద్ ప్రతినిధి:

నిజామాబాద్ నగరం లో సుమారు 15 పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న మండల విద్యాశాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదనీ ఏ ఐ ఎస్ ఎ జిల్లా కార్యదర్శి జ్వాల డిఇఓ అశోక్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. అనుమతులు లేకుండా పాఠశాలలు నడుపుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కార్పొరేట్ విద్యా సంస్థలు పదో తరగతి పరీక్షలు కూడా పూర్తికాకముందే అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని, తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో జిల్లా విద్యాశాఖ అనుమతులు లేని పాఠశాలల లిస్టు ను డీఈఓ కు అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.