దేశాయిపేట్ సహకార సంఘం ఉపాధ్యక్షుడు అంబర్ సింగ్ గుండెపోటుతో మృతి.

బాన్సువాడ, మార్చి 25, ప్రజాగళం.
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ సహకార సంఘం ఉపాధ్యక్షుడు కేతావత్ అంబర్ సింగ్ రాథోడ్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. మండలంలోని పోచారం తాండ కు చెందిన అంబర్ సింగ్ స్నేహశీలిగా పేరుగాంచారు. అందరితో కలుపుగోలుగా ఉండే అంబర్ సింగ్ అకస్మితంగా మరణించడం గ్రామస్తులను తీవ్రంగా కలిసి చేసింది. కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి జిల్లాల మాజీ డిసిసిబి చైర్మన్, దేశాయిపేట సొసైటీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు..

Leave A Reply

Your email address will not be published.