నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
నిజామాబాద్ జిల్లా గిరిజన అర్హత గల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలానే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన “రాజీవ్ యువ వికాసము 2024- 25” ప్రకటించిందన్నారు.గిరిజన నిరుద్యోగులు జిల్లా వ్యాప్తంగా అర్హత ఉన్నవారు మరియు ఆసక్తి కల నిరుద్యోగులు OBMMS ఆన్లైన్ పోర్టల్
https://tgobmmsnew.cgg.gov.in/ ద్వారా దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగోరావు ఒక ప్రకటనలో తెలిపారు 2020 -21,
2021 -2022 ఆర్థిక సంవత్సరంలో OBMMS ద్వారా దరఖాస్తు చేసుకొని మంజూరు కానీ లబ్ధిదారులు తిరిగి ఇప్పుడు పైన తెలిపిన వెబ్సైట్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఏప్రిల్ 5, 2025 అని మరిచిపోకుండా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కొరకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయము ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ రూమ్ నంబర్ 207/ 208 లో సంప్రదించాలని మరిన్ని వివరాలకై ఫోన్ నెంబర్ 08462 – 295503 ఫోన్ చేసి సంప్రదించగలరు.

