పది ఫలితాల్లో కేఓఎస్ విద్యార్థుల ప్రభంజనం -596 మార్కులతో రాష్ట్ర ప్రథమ ర్యాంక్ సాధించిన కేఓఎస్ విద్యార్థిని ఎస్. కృతి

 

నిజామాబాద్ , ఏప్రిల్ 30( ప్రజాగళం)

పదవ తరగతి ఫలితాల్లో కాకతీయ ఒలంపియాడ్ స్కూల్(కేవోఎస్) విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించారు. పాఠశాలకు చెందిన ఎస్.కృతి 596 మార్కులతో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించినట్లు కాకతీయ విద్యాసంస్థల ఛైర్పర్సన్ సి హెచ్. విజయలక్ష్మి తెలిపారు.కేవోఎస్ విద్యార్థిని కృతి పదో తరగతి ఫలితాల్లో 596 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకు కైవసం చేసుకుంది. హిందీ మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు శాతం గ్రేడ్ పాయింట్లు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థినిని కాకతీయ యాజమాన్యం అభినందించింది.

రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించి విద్యాసంస్థకే కాకుండా జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిందని డైరెక్టర్లు రామోజీరావు, తేజస్విని, రాజా కొనియాడారు. అనంతరం విద్యార్థిని కృతి మాట్లాడుతూ.. కేవోఎస్లో ఉపాధ్యాయులు అందించిన ఉత్తమ విద్యతోనే తాను స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించగలగానని తెలిపింది. ప్రతి సబ్జెక్టులో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని వివరించింది. డైరెక్టర్లు రామోజీ, తేజశ్విని లు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతి విద్యార్థి రాణించేలా వెన్నంటి ఉండి ప్రోత్సహించారని తెలిపింది. అంతేకాకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పింది. అందరి కృషి వల్లే తాను మొదటి ర్యాంకు సాధించినట్లు వెల్లడించింది. కేఓఎస్

విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మరిన్ని ర్యాంకులు సాధించారు. నితీష్ (591 మార్కులు), ఎస్ఎన్వి.అఖిల్ (590), డి.కృతి( 587), సాయి శ్రేయస్, వర్షిని(586), ఆదిబా సిద్ధికి, గౌతం (585), జశ్వంత్ (584), అస్త గౌర్ (583), భవాని, యోచన (582) మార్కులతో రాష్ట్ర స్థాయిలో మెరిశారు. ఈ సందర్భంగా వీరిని కాకతీయ యాజమాన్యం అభినందించింది.

Leave A Reply

Your email address will not be published.