ప్రజాగళం/ నిజామాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 30:
బుధవారం రోజు విడుదలైన 2025 10వ తరగతి ఫలితాలలో కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థిని ఎస్ క్రితి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్లు కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ సిహెచ్ విజయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా ఒలంపియాడ్ విద్యార్థులు 17 స్టేట్ ర్యాంకులు సాధించడం తమ పాఠశాలకు ఎంతో గర్వకారణమని ఇట్టి ర్యాంకుల సాధనలో కృషిచేసిన ఉపాధ్యాయులకు అదేవిధంగా ప్రిన్సిపాల్ ఫరీదుద్దీన్ విద్యార్థిని తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో ప్రపంచంతో పోటీ పడాలంటే ఉన్నతమైన విద్య ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తుకు గట్టి పునాది వేయాలి అంటే ఉత్తమమైన విద్యను అందించే మా విద్యా సంస్థలలో విద్యార్థులను చేర్పించాలని కోరారు. కాకతీయ ఒలంపియాడ్ పాఠశాలలో చదువుతున్న నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తమ విద్యాసంస్థలకు ఎంతో గర్వంగా ఉందని 500 మార్కులకు పైగానే సాధించారని ఆమె తెలియజేశారు.

