నిజామాబాద్ సిటీ జూన్ 21 ( ప్రజాగళం)
ప్రపంచంలోని అన్ని దేశాల్లోకెల్లా భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్న ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ పేర్కొన్నారు.శనివారం గౌతమ్ నగర్ లోని ఎస్సీ మోర్చా నగర శాఖ ఆధ్వర్యంలో 11వ సాల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శివాజీ మాట్లాడుతూ, ఏలాంటి ఎన్నికలు జరిగినా ఎస్సీ మోర్చా సభ్యులు క్రియాశీలకంగా పనిచేయాలని 11 ఏళ్లుగా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఘనత ప్రధాని మోడీకే చెందుతుందన్నారు. మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బిజెపి పార్టీ బలోపేతమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఒకప్పుడు తన తండ్రి చాయ్ అమ్ముతూ చాయ్ వాలా గా పేరోoదిన దేశంలో దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కష్టాన్ని గుర్తించి ఆయనకు దక్కిన ప్రధాని అవకాశాన్ని సద్వినియోగపరచుకొని అట్టడుగు వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా పాలన సాగుతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలువాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శివప్రసాద్, ఎస్సీ సంఘం నాయకులు సందీప్, సాయిరాం, లక్ష్మీనారాయణ, ప్రతాప్, బాలకృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు.

