నిజామాబాద్ క్రైమ్ సెప్టెంబర్ 20 ( ప్రజా గళం )
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 9 మంది ఎస్సైలను బదిలీ చేశారు.నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో శనివారం ఎస్సైల బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. . ఈ మేరకు సీపీ సాయిచైతన్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం తొమ్మిది మందిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఆర్మూర్ ఎస్సై 2 గా పని చేస్తున్న గోవింద్ ను సీసీఎస్ బదిలీ చేశారు.. సిలివేరి మహేశ్ ను నిజామాబాద్ నాల్గో టౌన్ నుంచి సీసీఎస్ బదిలీ చేశారు. గంగుల మహేష్ ను వీఆర్ నుంచి సీసీఎస్ అటాచ్ చేశారు. గురుక మహేష్ ను వీఆర్ నుంచి ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
సామ శ్రీనివాస్ ను సౌత్ రూరల్ నుంచి నిజామాబాద్ రూరల్ ఎస్సై–2గా బదిలీ చేశారు. మొగులయ్యను ఒకటో టౌన్ నుంచి మాక్లూర్ పీఎస్ రెండో ఎస్సై–2గా పంపించారు. వీఆర్‌లో ఉన్న కె.వినయ్ కుమార్ ను ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. సాయన్ గౌడ్ ను వీఆర్ నుంచి సీఎస్బీ నిజామాబాద్ కు ట్రాన్స్ఫర్ చేశారు. వీఆర్‌లో ఉన్న బీబీఎస్ రాజును కలెక్టరేట్‌కు అటాచ్ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే తమకు కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
