నిజామాబాద్ రూరల్ ఏప్రిల్ 29 ( ప్రజా గళం)
నిజామాబాద్ జిల్లా పర్యటనలో రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాకు విచ్చేసిన మంత్రిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం రూరల్ మండలంలోని మల్కాపూర్ కొత్తపేట లో పర్యటించి.. ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు. వారితో ఆప్యాయంగా పలకరించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూలీలతో కలిసి కాసేపు శ్రమ దానం చేసి పలు సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకురాగా వాటి

పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతుందని వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం కారణంగా కొన్ని సాంకేతిక ఇబ్బందుల కారణంగా కూలీలు సతమతమవుతున్నారని తెలిపారు. కొత్తపేట గ్రామస్థులు రోడ్డు విషయం ప్రస్తావించగా తక్షణమే మంజూరు చేస్తామని మంత్రి తెలపడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తంచేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,మునిపల్లి సాయి రెడ్డి, అమృతాపూర్ గంగాధర్, పొలసాని శ్రీనివాస్, ఆర్మూర్ బాల్ రాజ్, చిన్నా రెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

