ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే పార్టీ కార్యాలయాలు. కాంగ్రెస్ పార్టీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి సీతక్క.

నిజామాబాద్ ఏప్రిల్ 29 (ప్రజా గళం ప్రతినిధి)

 

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.

నిజామాబాద్ నగరoలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బుధవారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క, మాట్లాడుతూ

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పార్టీ మరింత బలోపేతం కావడానికి కార్యాలయాల నిర్మాణం అవసరమని, నిజామాబాద్‌లో నిర్మించబడుతున్న ఈ భవనం కార్యకర్తలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ప్రజా పాలనలో పారదర్శకత, బాధ్యతాయుత సేవలను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం టీపీసీసీ చీఫ్

మహేష్ కుమార్ గౌడ్, మాట్లాడుతూ ,

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిజామాబాద్‌లో కొత్త కార్యాలయం నిర్మాణం పార్టీ కార్యకలాపాలకు కొత్త ఊపు తీసుకువస్తుందని, కార్యకర్తల సమన్వయానికి ఇది కీలక కేంద్రంగా మారుతుందని వెల్లడించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ అలీ షబ్బీర్, సుదర్శన్ రెడ్డిలు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించే దిశగా ముందుకెళ్తుందన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని నిర్మించడo కార్యకర్తల్లో మరింత నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందన్నారు.

ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాహెర్ బిన్ హందాన్, గడుగు గంగాధర్ కార్యకర్తలు, నాయకులు , కార్పొరేటర్లు ఉత్సాహభరిత హాజరుతో విజయవంతంగా ముగిసింది.

Leave A Reply

Your email address will not be published.