నిజామాబాద్ క్రైమ్ జూలై 30 (ప్రజా గళం )
నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఏఎస్ఐలుగా విధులు నిర్వర్తిస్తున్న 11మందికి ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశానుసారముగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 11 మంది ఏ.ఎస్.ఐ లకు ఎస్.ఐలు గా ప్రమోషన్ లభించింది.
గత కొంతకాలంగా ఎస్సైలుగా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న ఏ. ఎస్.ఐ లకు ఎస్.ఐ లు గా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి పొందిన ఎస్సైలు పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతి పొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
మహిళా పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ జాన్సన్,వేల్పూరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి,
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ లు అనిల్ కుమార్,
.శ్రీనివాస్ రెడ్డి తో పాటు
ఏ.ఎస్.ఐ, 2వ టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై సాయిలు, 4వ టౌన్ పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ నాయక్ అలీ, ఏ.ఎస్.ఐ,1 వ టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ చిన్న గంగారం, నవీపేట్ పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ ఎస్. కే గఫర్,
బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ బాబురావు,జక్రన్ పల్లి పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ శంకర్,
రుద్రూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రేణుకా దేవి లకు ఎస్ఐలుగా పదోన్నతి లభించింది.

