నిజామాబాద్ సిటీ జులై 30 ( ప్రజాగళం )
ఆగస్టు 2వ తేదీన నిర్వహించనున్న ఊర పండుగను పురస్కరించుకొని గురువారం బండారు ప్రక్రియను పూర్తి చేశారు.
సర్వ సమాజ్ కమిటీ నిర్ణయం మేరకు ఆగష్టు 2 తేదిన ఆదివారం జరగనున్న ఊర పండుగనూ పురస్కరించుకొని శుభసూచకంగా గురువారం నిజామాబాద్ (ఇందూర్) సర్వసమాజ్ కమిటీ,శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పసుపు, కుంకుమ, పూలతో బండారు ప్రక్రియతో పాటు, కల్లు సాకాలు సమర్పించారు.ఈ సందర్బంగా దున్నపోతునూ ఊరి మీదకు విడవడం జరిగింది. గురువారం నుండి మన గ్రామ దేవతలా విగ్రహాలు తయారీ, ఊర పండగ కోసం ఏర్పాట్లు ప్రారంభమైనట్లు సర్వ సమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆదే ప్రవీణ్ తెలిపారు. అలాగే అనాదిగా వస్తున్న ఆచారం, పెద్దల ద్వారా వస్తున్న ఊర పండుగ మన గ్రామ దేవతల ఊరేగింపులో ప్రజలందరు పెద్ద ఎత్తున పాల్గొని మన గ్రామ దేవతల తల్లుల ఆశీర్వాదం పొందాలని సూచించారు. ఈ ఊర పండుగతో పాడిపంటలు, పశుసంపాద వృద్ధి చెందాలని, పిల్లలు, పెద్దలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలందరీకి అష్టఐశ్వరాలనూ కలగాలని, దృష్ట శక్తులు దరి చేరకుండా ఉండాలని సర్వసమాజ్ కమిటీ కో కన్వీనర్ అదే ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కోరడి కిరణ్, ఉపాధ్యక్షులు, కార్పొరేటర్ మల్కాయి మహేందర్, మాజీ కార్పొరేటర్ రామాడ్గు బాలకిషన్, సెక్రటరీ ధామ ఇంద్రకరణ్, పెద్ద కాపులు మల్కాయి లక్ష్మినారాయణ, గంట పెద్ద నర్సయ్య, స్వామి, లింబాద్రి స్వామి, కొరడీ చిన్న నర్సయ్య, కోర్వ భూపాల్, పెద్ద మనుషులు సుంకేటి ప్రవీణ్, మల్కాయి భోజన్న, జానకంపేట్ అశోక్, మల్కాయి సుదర్శన్, పసుల రాజు తదితరులు పాల్గొన్నారు

