నిజామాబాద్ జులై 30 (ప్రజా గళం ప్రతినిధి)
దేశ సమైక్యత, సౌభ్రతత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు.
పరాయి దేశంతో పోరాడి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలతో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నమని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య విద్యార్థులకు సూచించారు..అలాంటి దేశ సమైక్యత, సమగ్రత, సౌభ్రతత్వాన్ని ఐక్యతను చాటి చెప్పే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీపీ స్పష్టం చేశారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశభక్తిపై అవగాహన, చైతన్య కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా సంక్షేమ అధికారిని సౌందర్య, వయోజన విద్య ఉపసంచాలకులు. పురుషోత్తం పాల్గొన్నారు.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ఎందరో

మహనీయుల ప్రాణ త్యాగాలు పోరాటాల ద్వారా పరాయి దేశంతో పోరాడి మనం స్వాతంత్రాన్ని సాధించుకున్నామని వెల్లడించారు.దేశ సమైక్యత, సౌభ్రతత్వం,ఐక్యత ప్రపంచ నలుమూలల చాటి చెప్పే బాధ్యత నేటి యువతతో పాటు చిన్న పెద్ద ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.. అంగవైకల్యం అనేది శరీరానికి మాత్రమే కానీ మనిషి మేధస్సుకు కాదని ఇక్కడున్న దివ్యాంగ విద్యార్థులు నిదర్శనమన్నారు.. ఎలాంటి నిరుత్సాహానికి గురికాకుండా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని అప్పుడే ఉన్నత శిఖరాలు అధిరోహించడం సాధ్యమవుతుందని చెప్పారు. తమ పోలీస్ శాఖ తరపున సైతం తమ అంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగ విద్యార్థులైనప్పటికీ వారిని ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తున్న స్నేహ సొసైటీ నిర్వాహకులు ఎస్. సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, ఉపాధ్యాయ బృందాన్ని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.. అయితే అంధ మానసిక దివ్యాంగ విద్యార్థులు అయినప్పటికీ వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను పాటలను విన్న పోలీస్ కమిషనర్ వారిని అభినందించారు.. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన క్విజ్, చిత్రలేఖనం, ఇతర పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులను అందజేశారు.. అనంతరం జిల్లా సంక్షేమ అధికారిని సౌందర్య మాట్లాడుతూ స్నేహ సొసైటీ దివ్యంగ విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.. ఒక ఆశయంతో ముందుకు సాగుతూ దివ్యాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో జిల్లా, రాష్ట్ర , జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు సాధించి జిల్లాను జాతీయస్థాయిలో నిలిపారని తెలిపారు.. అలాగే దేశ స్వాతంత్రాన్ని పురస్కరించుకొని దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో మహనీయులు చేసిన పోరాటాలు,వారి ప్రాణ త్యాగాల గురించి విద్యార్థులకు తెలియజేశారు… అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను ప్రతి ఒక్కరిని శాలువలు , జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు…ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ సభ్యులు తాటి వీరేశం , 42 వ డివిజన్ కార్పొరేటర్ బెల్లల్ శశాంక్ రెడ్డి, 18వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి రమేష్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దాసరి విజయనంద రావు, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు దారం గంగాధర్, అందుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి పాఠశాలల సిబ్బంది అంద విద్యార్థులు, మానసిక వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.

