నిజామాబాద్ రూరల్ ఆగస్టు 3( ప్రజా గళం )
తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులను వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య యం. యాదగిరితో కలిసి సోమవారం పరిశీలిoచారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, నాణ్యతలో రాజీ పడకూడదని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఆరతి, ఆచార్య సంపత్ కుమార్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య జి. రాంబాబు, డాక్టర్ టి. సంపత్ పాల్గొన్నారు.

