నిజామాబాద్ సిటీ ఆగస్టు 5( ప్రజా గళం )
నిజామాబాద్ పట్టణంలో అరె కటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించే ఇలాంటి పండుగలు మన సంస్కృతికి గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి రామకృష్ణ, మల్లికార్జున్, కార్పొరేషన్ చైర్మన్లు శేఖర్ గౌడ్, కేశ వేణు ,మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఆరెకటిక సంఘం జిల్లా అధ్యక్షులు రవీందర్, నగర అధ్యక్షులు జమాల్పూర్ రమేష్, రాజారాం, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అరె కటిక సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు.

