ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో ఉన్నత స్థాయికి ఎదగాలి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. 130 మంది విద్యార్థులకు 13 లక్షల రూపాయల చెక్కుల అందజేత.

 

నిజామాబాద్ సిటీ ఆగస్టు 9 ( ప్రజాగళం )

ఎం ఎస్ ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆర్థిక సాయం అందుకుంటున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉద్భోదించారు.

నిజామాబాద్ నగరo లోని అమ్మ వెంచర్‌లో గల ఎస్ ఆర్ కె ఫంక్షన్ హాల్*లో ఎమ్మెస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమంను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్కాలర్షిప్ పొందిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మొత్తం 130 మంది ఉత్తమ విద్యార్థులకు 13 లక్షల రూపాయల మేరకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు.

 

“స్కాలర్‌షిప్ తీసుకునే విద్యార్థులు జీవితంలో సక్సెస్ కావాలనే బృహత్తరమైన సంకల్పంతో ఎమ్మెస్సార్ ఫౌండేషన్ ఆర్థిక సాయం అందించాలనే దృక్పథం అభినందనీయమన్నారు. విద్యార్థులు

మొబైల్ ఫోన్‌ ల కు బానిసలుగా మారి తమ ఉజ్వల జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. క్రమశిక్షణతో కూడిన జీవితాలను విద్యార్థి దశ నుండే అలవాటు చేసుకుని తమ తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలన్నారు. ప్రతి విద్యార్థి వ్యక్తిత్వంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఫౌండర్ శివారెడ్డి మాట్లాడుతూ,.

గత ఐదేళ్లుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నామన్నారు.

స్కాలర్‌షిప్ తీసుకున్న విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు.భవిష్యత్తులో మీరు కూడా ఇతరులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చే స్థాయికి ఎదగాలని శివారెడ్డి ఆకాంక్షించారు.తల్లిదండ్రులు, గురువులను ఎప్పటికీ మరిచిపోకూడదని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కో ఫౌండర్ శిరీషతో పాటు ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.