ఖిల్లా రామాలయంలో కన్నుల పండుగగా సీతారామ కళ్యాణం. -ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక కళ్యానోత్సవంలో పాల్గొన్న 60 జంటలు

 

నిజామాబాదు సిటీ, ఆగష్టు 10( ప్రజా గళం )

 

జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో సీతారాముల కళ్యాణం సోమవారం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో 60 జంటలు సీతారామ సామూహిక కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ సభ్యుడు తాటి వీరేశం గుప్తా మాట్లాడుతూ పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రతినెల కళ్యాణోత్సవములు నిర్వహిస్తున్నామని ఈనెల 60 జంటలతో కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ సభ్యులు కళ్యాణోత్సవంలో పాల్గొన్న జంటలకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య దంపతులు కళ్యాణ

 

మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఖిల్లా ఆలయ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గురు ప్రసాద్, కోశాధికారి పెండ్యాల శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు ముక్క దేవేందర్ గుప్తా, కొండ వీరశేఖర్ గుప్తా, కార్పొరేటర్ సత్యపాల్ దంపతులు,మాజీ కౌన్సిలర్ కొండ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.