ఆర్మూర్,ఆగస్టు 9(ప్రజగళం):
ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం అమ్రాద్ తండాలో తీజ్ వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు.గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని సేవాలాల్ మహారాజ్,జగదంబ భవాని ఆలయంలో దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవతలను నమ్మిన భక్తులు కోరిన కోర్కెలు తెర్చే కొంగుబంగారంగా కొలిచారుతీజ్ పండగను గ్రామంలో గ్రామస్థులు భక్తి శ్రేద్దాల మధ్య తొమ్మిది రోజులు పాటు జరిపారు.తిజ్ పండగ సందర్బంగా పుట్ట మన్ను తెచ్చి గోధుమలు, శనగలను మట్టిలో వేసి తొమ్మిదిరోజులు గుడిలో ఉంచుతారు.

గౌరీ,గౌర వివాహ వేడుకల ప్రాధాన్యతాను మహిళలకు వివరిస్తూ,సితల్ చివరి రోజు తీజ్ కార్యక్రమం నిర్వహిస్తారు.గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ నందిని సంతోష్ మాట్లాడుతూ పెండ్లి కానీ వయసు వారికి మంచి భర్త దొరకాలని,పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.

అనంతరం తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.సాంప్రదాయపద్ధంగా మహిళలకు ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పిస్తారు.గ్రామస్తులు అందరూ ఊరేగింపుగా చివరి తొమ్మిదవ రోజు మహిళలు తీజ్ నెత్తిన పెట్టుకొని సమీపంలోని నీటి ప్రవాహంలో వేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామస్తులు భక్తిశ్రద్ధల మధ్య పూజలు నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మలవత్ నందిని సంతోష్,గ్రామ నాయకుడు మోతిలాల్ నాయక్,గణేష్ నాయక్, మాజీ సర్పంచ్ మేగవత్ కిషన్ లాల్, బంజాారా పెద్ద మనుషుులుు, మహిళలు పాల్గొన్నారు.

