సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి. ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవత్రి రాజశేఖర్. నలంద పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు.

ఆర్మూర్ ఆగస్టు 7 (ప్రజాగళం).

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపిట్ట వేసిందన్న ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్అన్నారు. శనివారం పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవత్రి రాజశేఖర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మన సాంప్రదాయాలను, కట్టుబాట్లను ఎప్పుడు మరవకూడదని విద్యార్థులకు సూచించారు. బోనాల పండుగ అంటే సంస్కృతికి ఒక చిహ్నం అన్నారు. బోనాలు అంటే రైతులు పంట దిగుబడి వచ్చినప్పుడు బోనంలో వంటవండి నైవేద్యంగా పెడతారన్నారు, వేప ఆకులు మనకు ఆరోగ్యానికి రక్షగా ఉంటాయని విద్యార్థులకు వివరించారు. నలంద పాఠశాలలో విద్యార్థులు చదవడం వారి భవిష్యత్తుకు బాట వేసిన వారవుతారన్నారు. పాఠశాల యజమాన్యం విద్యార్థులను క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించడాన్ని అభినందించారు. నలంద ప్రసాద్ ,xననంద సాగర్ లు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దెందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా నలంద పాఠశాల ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.