నందిపేట్ ఆగస్టు 11 (ప్రజాగళం )
మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురికి మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధించడం జరిగిందని నందిపేట్ ఎస్సై వినయ్ తెలిపారు.జులై నెల లో నిర్వహించిన వాహనాల తనిఖీలలో నందిపేట్ లో డ్రంకన్ డ్రైవ్ లో దొరికిన 5 గురిని మంగళవారం ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా న్యాయమూర్తి గట్టు గంగాధర్ తాగి వాహనం నడిపిన 5 గురి కి జైలు శిక్ష విధించారు. నందిపేట్ కు చెందిన టేకు సాయిలు కు 5 రోజులు, న్యాల్కల్ కు చెందిన వరికొప్పుల అశోక్ కు 5 రోజులు, నందిపేట్ కు చెందిన గోసం చిన్నయ్య కు 5 రోజులు , సాయిలు కు 4 రోజులు, నవీపేట్ కు చెందిన బొమ్మల రాజు కు 3 రోజుల శిక్ష విధించినట్లు ఎస్సై వెల్లడించారు.తాగి వాహనాలు నడపడం చట్టం నేరం తాగి వాహనాల నడిపి దొరికిన వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తూచ తప్పకుండా పాటించాలని నందిపేట్ ఎస్సై వినయ్ సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు నందిపేట్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. నందిపేట్ ఎస్సై వినయ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు వాహనాల తనిఖీలను చేపడుతున్నారు.

