వన్నెల(కె) గ్రామంలో మన ఊరు మన భద్రత కార్యక్రమం. 11 సీసీ కెమెరాలను ప్రారంభించిన నందిపేట్ ఎస్సై వినయ్.

 

నందిపేట్ ఆగస్టు 11 (ప్రజాగళం )

 

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు వన్నెల(కె) గ్రామంలో మన ఊరు మన భద్రత కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. నందిపేట్ ఎస్సై వినయ్ ఆధ్వర్యంలో గ్రామంలో మన ఊరు మన భద్రత పై గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో 11 సీసీ కెమెరాలను ఎస్సై వినయ్ ప్రారంభించారు. గ్రామంలో గ్రామస్తుల తో మన ఊరు మన భద్రత మన బాధ్యత ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని ఎస్ఐ వినయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, గ్రామస్తుల కు సైబర్ నేరాల గురించి, సిసి కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ట్రాఫిక్ నిబంధనలను, మత్తు పదార్థాల నిరోధం గురించి అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు సేవించడం వల్ల జరిగే అనర్థాల గురించి గ్రామస్తులకు వివరించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఎస్సై సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం పై క్షుణ్ణంగా వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ జీవితాలను కాపాడుకోవాలని ఎస్సై అన్నారు. నిత్యం పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తoగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు నందిపేట్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.