నిజామాబాద్ సిటీ ఆగస్టు 12 (ప్రజాగళo)
రెంజల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర ను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ యాత్రను రెంజల్ గ్రామ సర్పంచ్ తిరుపతి లలిత బుజ్జి, ఎంఈఓ ఆంజనేయులు, ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ టీచర్స్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ తిరుపతి లలిత బుజ్జి మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగాతో ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందుతుందని ఆమె అన్నారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకోవాలని సర్పంచ్ తిరుపతి లలిత పిలుపునిచ్చారు. ఈ యాత్ర సందర్భంగా జాతీయ జెండా ప్రాముఖ్యతను వివరించారు.

