టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ పోస్టర్ ఆవిష్కరణ. -పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లాకు తొలిసారిగా కవిత -సభ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం

 

 

నిజామాబాద్ సిటీ ఆగష్టు 14( ప్రజాగళం)

 

ఈనెల 31న నిజామాబాద్ లో పాంచజన్య సంకల్ప సభ పోస్టర్లను శుక్రవారం తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు ఆవిష్కరించారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ సభకు రానున్నారని వెల్లడించారు.జిల్లా కేంద్రంలోని కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే ఈ సభలో తెలంగాణ రక్షణ సేన పార్టీ తీసుకున్న 5 లక్ష్యాలను కవిత వివరిస్తారన్నారు . పార్టీ సిద్ధాంతాలను పల్లె పల్లెకు చేరువ చేయాలని కవిత ఈ సభ ద్వారా పిలుపునివ్వనున్నారని పేర్కొన్నారు.పాంచజన్య సభ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం నిజామాబాద్ లోని టిఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని శ్రేణులకు రాష్ట్ర నాయకులు సూచించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జిల్లాకు రానున్న కవితకు పెద్ద ఎత్తున సభ విజయవంతం చేసి ఘన స్వాగతం పలకాలని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి అలీం తెలిపారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే సభతో ప్రధాన పార్టీలకు వెన్నులో వణుకు పుట్టాలని కోరుట్ల నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ రఘు పేర్కొన్నారు. నిజామాబాద్ లో జరిగే పాoచజన్య సభకు డాక్టర్ రఘు ను ఇన్చార్జిగా ఇప్పటికే ప్రకటించారన్నారు.ప్రతి పల్లె నుండి భారీ ఎత్తున శ్రేణులు కదలాలని టీఆర్ఎస్ నాయకులు రంగునవీన్ ఆచారి పిలుపునిచ్చారు. కవితక్క రాష్ట్రంలో అందరికి ఆడబిడ్డ అయితే నిజామాబాద్ జిల్లాకు కోడలు అని ఈ జిల్లా బిడ్డను ఆదరించి అక్కున చేర్చుకోవాలని జిల్లా ప్రజలను ఆయన కోరారు. శ్రేణులు ఆ దిశగా నడుంబిగించి అన్ని వర్గాల ప్రజలను కదిలించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈనెల 26న మిలాద్ ఉన్ నబి పండుగ ఉన్నందున సభను ఈనెల 31కు మార్చినట్లు తెలిపారు.ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి నవీన్ రెడ్డి మాట్లాడుతూ వివిధ సమస్యల మీద ఇప్పటికే పార్టీ నుండి ఉద్యమాలు నిర్వహించినందున ఆ వర్గాలను కూడా సమీకరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జి ఎం.ఎ అలీమ్, కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి డా. రఘు, మహిళా నాయకురాలు విజయ లక్ష్మి,టీఆర్ఎస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.