నిజామాబాద్ సిటీ , ఆగస్టు14 (ప్రజాగళం )
బంజారా తీజ్ ఉత్సవం, దీనిని తీజారి అని కూడా పిలుస్తారని ఇది భారతదేశంలోని సంచార తెగకు చెందిన బంజారా సమాజానికి సంబంధించిన ముఖ్యమైన వేడుక అని ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి , డాక్టర్ సులోచన రాణి, డాక్టర్ బిలోజీ నాయక్ లు వెల్లడించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, బంజారాలకు గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందని . తీజ్ పండగ వారి సంప్రదాయాలలో ముఖ్యమైన భాగం అని పేర్కొన్నారు . హిందూ పురాణాలలో మూలాలున్న ఈ పండుగ పురాతన కాలం నాటిదని. వైవాహిక ఆనందం భక్తికి ప్రతీకగా శివ పార్వతిల కలయికను తీజ్ గుర్తుచేస్తుందన్నారు.తీజ్ పండగ శ్రావణ మాసం (జూలై-ఆగస్టు) లో జరుపుకుంటామన్నారు.
పెళ్లి కానీ ఆడపడుచులు,బంజారా మహిళలు తమ భర్తల, కుటుంబాల ఆశీర్వాదం కోసం పార్వతీ దేవి కటాక్షం కొరకు ఉపవాసం, ప్రార్ధనలు, పూజలు చేస్తారన్నారు.ఈ పూజ కార్యక్రమంలో పువ్వులు, ఆకులు, రంగురంగుల రంగోలీలతో గృహాలు, దేవాలయాలను అలంకరిస్తారన్నారు.జానపద పాటలు పాడుతూ సాంప్రదాయ నృత్యాలు చేస్తారని,పార్వతీ దేవికి ప్రార్ధనలు, పండ్లు స్వీట్లు సమర్పించి ఒకరికి ఒకరు బహుమతులు, సాంప్రదాయ వస్త్రాలను మార్పిడి చేసుకుంటారన్నారు.తీజ్ వైవాహిక సామరస్యం, ప్రేమ, భక్తి యొక్క ప్రాముఖ్యతను బలపరుస్తుందన్నారు.ఇది బంజారా సంస్కృతి, సంప్రదాయాలు సమబంధాన్ని ప్రదర్శిస్తుందన్నారు.. ఈ పండగ బంజారా ప్రజల మధ్య సంతోషం, వేడుకలను ప్రోత్సహిస్తుందన్నారు . నిజామాబాద్ నగరం ఈ నెల 14వ తేదీ నుండి 23 వ తేదీ వరకు గిరిజన బంజారా మహిళలు యువతులు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా 9 రోజుల పాటు అంగరంగ వైభావంగా నిర్వహించుకుంటున్నారు. ఇందులో భాగంగా పెళ్లికాని ఆడపడులు తొమ్మిది రోజులపాటు ఎంతో భక్తిశ్రద్ధలతో గోధుమ విత్తనాలతో బుట్టలకు ఎంతో పవిత్రంగా నీరు పోస్తారన్నారు. భక్తిశ్రద్ధలతో బంజారా గిరిజన యువతులు తమ భవిష్యత్తు బాగుండాలని,
సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండాలని ఈ సాంప్రదాయ పండు నిర్వహిస్తారన్నారు . ఇది గిరిజనుల ఆనవాయితీ అని చెప్పారు.తొమ్మిది రోజులు పెళ్లి కానీ ఆడపడుచులు పూజలు నిర్వహించిన అనంతరం సమీపంలో చెరువులో కానీ నదిలో కానీ వీటిని నిమజ్జనం చేస్తారన్నారు . బంజారా ఫెస్టివల్ అనేది ఒక శక్తివంతమైన అర్థవంతమైన వేడుక అని , ఇది బంజారాల గొప్ప వారసత్వం, సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో బంజారా సంఘ ప్రతినిధులు,మహిళలు పాల్గొన్నారు.

