బోధన్ లో హర్ పుర్ తిరంగా భారీ ర్యాలీ,100 మీటర్ల జెండాతో దేశ ఐక్యత చాటిన బీజేపీ….

బోధన్ ప్రతినిధి, ఆగస్టు 14: (ప్రజా గళం)
భారత మాత ముద్దుబిడ్డ,భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం”హర్ మర్ తిరంగా భారీ ర్యాలీ”కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ ర్యాలీలో 100 మీటర్ల భారీ జాతీయ జెండాతో బీజేపీ కార్యకర్తలు ర్యాలీగా పాల్గొని దేశ ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ బోధన్ నియోజకవర్గ ఇంచార్జి వడ్డీ మోహన్ రెడ్డి హాజరై మా ట్లాడుతూ..ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే నేడు మనం స్వతంత్ర్య స్వేచ్ఛా వాయువులు పీలుస్తు న్నామని అన్నారు.దేశ యువత,ప్రజలందరూ వారిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.దేశ రక్షణలో మనం సైతం ముందుం డి భారతదేశ గౌరవ పతిపలను ముందుండి భారతదేశ గౌరవ ప్రతిష్టలను పెంచేలా అందరూ కలిసి స్వాతంత్ర్య దినోత్సవ పండుగను జరుపుకోవాలని,ప్రధాని పిలుపు ఇచ్చారని తెలిపారు.అందుకే ప్రతి భారతీయుడు గర్వంగా ఆగస్టు 15న తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపికిషన్,మాజీ పట్టణ అధ్యక్షు లు కొలిపాక బాలరాజు,సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి,గుంత గంగాధర్,రాజులదేవి పవన్ కుమార్, హన్మండ్లు చారి,బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మీర్జా పూర్ అరవింద్,కార్యదర్శి దేవకాటే శివరాజ్,బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్,పార్టీ నాయ కులు పప్పుల వేణు,శ్రీకాంత్,దుర్గా ప్రసాద్,గడ్డం శ్రీనివా స్,మహేష్,కస్ప లింగం,అనీల్,పడాల శ్రీను,ఫణి తదిత రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.