స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో భారీగా ఏర్పాట్లు. ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇన్‌చార్జ్ కలెక్టర్, పోలీస్ కమిషనర్.

 

 

నిజామాబాద్‌లో ఆగస్టు 15 ( ప్రజా గళం ప్రతినిధి)

 

80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థుల విన్యాసాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించనున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను నిజామాబాద్ ఇన్‌చార్జ్ కలెక్టర్ భవేష్ మిశ్రా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య శుక్రవారం పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో వేదిక , బారికేడింగ్ , అతిథుల కూర్చునే ఏర్పాట్లు , పార్కింగ్ , ట్రాఫిక్ నియంత్రణ , భద్రతా చర్యలు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు , అధికారులు , ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

 

ఆగస్టు 15న నిర్వహించనున్న కార్యక్రమం విజయవంతంగా , ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన బందోబస్తు , ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన వారిలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) భుజంగ రావు , ఎ.ఆర్ ఏసీపీ శ్రీరాములు , మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ , నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి , సి.ఐలు , ఆర్.ఐ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.