ఆల్ప్రాజోలం అక్రమ రవాణాదారులపై నిజామాబాద్ పోలీసుల ఉక్కుపాదం…..డ్రగ్ అక్రమ రవాణా ద్వారా సంపాదించిన రూ.5.15 కోట్ల విలువైన ఆస్తులు జప్తు… అంతర్రాష్ట్ర డ్రగ్ తయారీ,సరఫరా నెట్‌వర్క్‌పై పకడ్బం దీ దర్యాప్తు….నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య వెల్లడి

బోధన్ ప్రతినిధి,ఆగస్టు 22: (ప్రజా గళం)

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆల్ప్రా జో లం వంటి మత్తు పదార్థాల అక్రమ తయారీ,రవాణా, సరఫరా అలాగే విక్రయాలకు పాల్పడుతున్న వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోంది అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు.పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం, బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్ పర్యవేక్షణలో బోధన్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.విజయ్ బాబు ఆధ్వర్యంలో చేప ట్టిన దర్యాప్తులో అంతర్రాష్ట్ర ఆల్ప్రాజోలం తయారీ, సరఫరా నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారని అన్నా రు.గత సంవత్సరం క్రితం అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారని తెలిపారు.బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్ప్రాజోలం తయారీ,సరఫరాకు పాల్పడు తున్న ఐదుగురు అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లపై సిఆర్.నెం. 148/2025గా ఎన్ డిపిఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి జైలు కు తరలించారు.వారి వద్ద నుంచి సుమారు 2.5 కిలోల ఆల్ప్రాజోలం,దాని విలువ సుమారు రూ.25 లక్షలు, స్కోడ కారు (ఎంహెచ్-14-హెచ్ డి-7889)ను,8 మొ బైల్ ఫోన్లు,రూ.2.50 లక్షల నగదు స్వాధీనం చేసుకు న్నట్లు చెప్పారు.మహారాష్ట్రలో అక్రమ ఆల్ప్రాజోలం తయారీ కేంద్రంను పోలీసులు గుర్తించారు.కేసు దర్యా ప్తులో భాగంగా నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసు కుని విచారించగా ఆల్ప్రాజోలం తయారీ,సరఫరాకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది అని తెలిపారు.బోధన్ రూరల్ సీఐ డి.విజయ్ బాబు ఆధ్వర్యంలో సుమారు 15 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందం మహారాష్ట్రకు వెళ్లి వారం రోజులపాటు విస్తృతంగా దర్యాప్తు చేపట్టింది అని,ఈ దర్యాప్తులో మహారాష్ట్ర లోని సతారా పారిశ్రామిక ప్రాంతంలో,“ సూర్య ప్రభ ఫార్మా కెమ్”పేరుతో ఎరువుల తయారీ కోసం అనుమతులు పొంది,అక్రమంగా ఆల్ప్రాజోలం తయారు చేస్తున్న ఫ్యాక్టరీని గుర్తించారు.అక్కడ నిర్వ హించిన సోదాల్లో సుమారు 30 కిలోల ఆల్ప్రాజోలం, దాని విలువ సుమారు రూ.3 కోట్లు,అక్రమంగా సంపా దించిన రూ.12 లక్షల నగదు,ఒక ఫోర్డ్ కారును స్వాధీ నం చేసుకుని,అక్రమంగా నిర్వహిస్తున్న ఫ్యాక్టరీని సీజ్ చేశారు.డ్రగ్ డబ్బుతో కూడబెట్టిన రూ.5.15 కోట్ల ఆస్తులపై జప్తుకు చర్యలు చేపట్టారు.డ్రగ్ అక్రమ రవా ణాలో నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు,వారు మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం ద్వారా సంపాదిం చిన ఆస్తులను గుర్తించి జప్తు చేయడంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ క్రమంలో మహారాష్ట్ర లోని పూణే,సతారా,అహ్మద్‌నగర్ జిల్లాల్లో సంబంధిత సబ్-రిజిస్ట్రా ర్ కార్యాలయాలు,తహశీల్దార్ కార్యాల యాలను సంప్రదించి నిందితులు,వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థిర,చర ఆస్తుల వివరాలను సేకరించారు.నిందితులు ఎ1 ఆమర్‌సింగ్,ఎ2 బసవరాజ్,ఎ5 లక్ష్మణ్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు ఆల్ప్రాజోలం అక్రమ విక్రయాల ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించడం జరిగింది అని పోలీస్ కమిషనర్ తెలిపారు.ప్రభుత్వ విలువల ప్రకారం సుమారు రూ.5.15 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించగా, బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ మరింత ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.సంబంధిత కంపెటెంట్ అథారిటీ,బొంబాయి అలాగే కంపెటెంట్ అథారిటీ,చెన్నై వారి ద్వారా ఎన్ డిపిఎస్ యాక్ట్,సెక్షన్ 68ఎఫ్(2)కింద ఆస్తుల జప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయని అన్నారు. జప్తు చేసిన ఆస్తుల వివరాలు వెల్లడించారు.9.06 ఎకరాల వ్యవసాయ భూమి 1,370 చదరపు గజాల ఖాళీ స్థలాలు,ఒక కెమికల్ ఫ్యాక్టరీ,4 నాలుగు చక్రాల వాహనాలు,2 ద్విచక్ర వాహనాలు,బ్యాంకు ఖాతాల్లో ఉన్న సుమారు రూ.27 లక్షల నగదు,నిందితుల అక్రమ ఆస్తులను పూర్తిగా గుర్తించి,సంబంధిత అధికారుల ద్వారా జప్తు చేయడానికి సుమారు ఒక సంవత్సరం పాటు నిరంతర దర్యాప్తు,న్యాయపరమైన ప్రక్రియ కొనసాగింది అన్నారు.సాంకేతిక పరిజ్ఞానంతో కీలక ఆధారాల సేకరణ,ఈ కేసు దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని పోలీసులు సమర్థవంతంగా వినియోగించారు.నేరానికి సంబంధం ఉన్న సుమారు 20 మంది వ్యక్తుల మొబైల్ ఫోన్ సమాచారాన్ని సేకరించి,విశ్లేషించి,దర్యాప్తుకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించారు. ఆల్ప్రాజోలం తయారీ కేంద్రాన్ని గుర్తించడం నుంచి డ్రగ్ నెట్‌వర్క్‌ను ఛేదించడం,అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించడం,వాటిపై జప్తుకు చర్యలు తీసుకు నే వరకు సుమారు 15 మంది పోలీసు సిబ్బంది చేసిన నిరంతర కృషి ఫలితంగానే ఈ చర్యలు సాధ్యమయ్యా యని పోలీస్ కమిషనర్ తెలిపారు.డ్రగ్ నెట్‌వర్క్‌పై ఆర్థిక దర్యాప్తు కూడా కొనసాగుతుంది.డ్రగ్ అక్రమ రవాణాలో పాల్గొనే వ్యక్తులను అరెస్ట్ చేయడం మాత్ర మే కాకుండా,మాదకద్రవ్యాల ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేయడం ద్వారా డ్రగ్ మాఫియాకు ఆర్థికంగా కూడా గట్టి దెబ్బ కొట్టే విధంగా చర్యలు కొనసాగిస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.మాదకద్రవ్యాల తయారీ, కొనుగోలు,రవాణా,నిల్వ,పంపిణీ, విక్రయాలు,ఆర్థిక లావాదేవీలు,వినియోగం వరకు మొత్తం డ్రగ్ వ్యవస్థపై నిరంతర నిఘా కొనసాగుతుందని,అంతర్రాష్ట్ర పోలీసు ల సమన్వయంతో దర్యాప్తును మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన బోధన్ రూరల్ సీఐ డి.విజయ్ బాబు ని,పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రత్యే కంగా అభినందించి ప్రశంసించారు.

ప్రజలకు ముఖ్యంగా యువత,విద్యార్థులు,ప్రతి ఒక్కరు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు,విద్యాసంస్థల నిర్వా హకులు, ప్రజాప్రతినిధులు,సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.డ్రగ్స్ అక్రమ రవాణా,అక్రమ నిల్వ,విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు.డ్రగ్ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్మూలించడంలో,ఆల్ప్రాజోలం వంటి మత్తు పదార్థా ల దుర్వినియోగాన్ని అరికట్టడంలో,ముఖ్యంగా యువ తను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడడంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని పోలీస్ కమిషనర్ తెలిపారు.“మత్తు పదార్థాలు లేని తెలంగాణ నిర్మాణానికి చేయి చేయి కలుపుదాం.”అని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.