బోధన్ ప్రతినిధి,ఆగష్టు 22: (ప్రజా గళం)
బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో,రోగులతో గొడవ పడి విధులకు ఆటంకం కలిగించి,పోలీసులపై దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బోధన్ పట్టణ సిఐ వెంకటనారాయణ తెలిపారు.సిఐ తెలిపిన వివరాలు ప్రకారం..శుక్రవారం రాత్రి బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో బోధన్ మండలం కోప్పర్గా గ్రామానికి చెందిన రమొల్ల సాయిలు,బండారు వినయ్ అనే ఇద్దరు వ్యక్తులు వైద్యునితో గొడవ పడుతూ,వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని సమాచారం మేరకు రాత్రి విధుల్లో ఉన్న బ్లూకోల్డ్స్ కానిస్టేబుళ్లు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు.వైద్యులకు,రోగులకు ఇబ్బంది కలిగిస్తున్న ఇద్దరిని నచ్చచెప్పెందుకు పోలీసులు ప్రయ త్నించినా,వారు వినకపోవడంతో పోలీసులు ఇద్దరిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకువస్తున్నారు.అయితే సదరు వ్యక్తులు పోలీసులతో గొడవపడి దాడి చేశారని, తెలిపారు.ఈ దాడిలో కానిస్టేబుల్ కి గాయాలు అయ్యాయని అన్నారు.ఈ సందర్బంగా ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు చేసి శనివారం రిమాండ్ కు తరలించి నట్లు సీఐ తెలిపారు.చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిపై దాడులకు పాల్పడి తే కఠిన చర్యలు తప్పవని సిఐ వెంకటనారాయణ హెచ్చరించారు.

