అక్టోబర్ 10 వ తేదీన వచ్చే శనివారం అమావాస్య సం దర్బంగా….పూజ సామాగ్రి విక్రయ దుకాణా సముదా యాల నిర్వహణకు వేలంపాట…..

 

 

ఎడపల్లి,ఆగస్టు 27: (ప్రజా గళం)

ఎడపల్లి మండలం జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహ స్వా మి ఆలయంలో లడ్డు పులిహోర,కొబ్బరి కాయ,నవధా న్యాలు అమ్ముకొనుటకు,సైకిల్ స్టాండ్ ఏర్పాటుకు గురు వారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో,దేవాదాయ ధర్మా య శాఖ అధికారులు వేలం పాట నిర్వహించారు.

వచ్చే అక్టోబర్ 10 వ తేదీన శనివారం అమావాస్య వస్తున్నందున,భక్తుల కోసం,పూజ సామాగ్రి,లడ్డు పులిహోర,కొబ్బరికాయ నవధాన్యాలు, సైకిల్ స్టాండ్ కు వేలం పాట నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వా హణాధికారి గింజుపల్లి వేణు తెలిపారు.లడ్డు,పులి హోర విక్రయించుకునేందుకు నిజామాబాద్ కు చెందిన జి.సురేష్ అనే వ్యాపారి వేలం పాటలో పాల్గొని 47 వేల రూపాయలకు దక్కించుకున్నారని,అలాగే కొబ్బరికా య,నవధాన్యాలు విక్రయించుకునేందుకు జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఏ.సిద్దు అనే వ్యాపారి వేలంపాట పాల్గొని 55 వేల రూపాయలకు దక్కించుచకోగా,సైకిల్ స్టాండ్ ఏర్పాటుకు జాన్కంపేట్ కు చెందిన సుమన్ 10 వేల రూపాయలకు వేలం పాటలో దక్కించుకున్నారని ఈవో వేణు తెలిపారు.వచ్చే శనివారం అమావాస్య రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పవిత్ర అష్ట ముఖి కోనేటిలో స్నానమాచరించి శ్రీ లక్ష్మినరసింహా స్వామి వారిని దర్శించుకుని స్వామి వారి కృపాకు పాత్రులు కావాలని భక్తులను అయన కోరారు. ఆలయ చైర్మన్ చిలుక రవికుమార్ మాట్లాడుతూ..వచ్చే అక్టోబ ర్ 10 న వచ్చే శనివారం అమావాస్య సందర్బంగా ఈ రోజున పూజ సామాగ్రి విక్రయానికి వేలం పాట నిర్వ హించడం జరిగింది అని తెలిపారు.శనివారం అమావా స్య కోసం భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ తరపున, దేవాదాయ ధర్మదాయ శాఖ తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని అన్నారు.ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో దక్షిణ భారత దేశంలోనే రెండవ పవిత్ర అష్టముఖి (పుష్కరిణి)కొనేరు వెలసియుందని,ఈ కోనేరులో స్నా నాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకొని మొక్కు లు చెల్లించుకుంటే కోరిన వారికి కొంగు బంగారమై, అష్టఐశ్వర్యలు సిద్దిస్తాయని భక్తులు విశ్వసిస్తారని అన్నారు.ఈ సందర్బంగా అమావాస్య శనివారం రోజున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని స్వామి కృపాకు పాత్రులు కావా లని చైర్మన్ చిలుక రవికుమార్ కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఎండోమెంట్ ఇన్స్ స్పెక్టర్ సుజాత రెడ్డి, ఆలయ డైరెక్టర్ లు,జింక లక్ష్మి లింగం,గ్రామ పెద్దలు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.