1000 రోజుల ప్రజా పాలన – ఇది ప్రజల విజయం – టీపీసీసీ ప్రతినిది గంగా శంకర్ వెల్లడి….బోధన్ లో కాంగ్రెస్ 1000 రోజుల పాలన సందర్బంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబురాలు జరుపుకున్న కాంగ్రెస్…..

 

 

బోధన్ ప్రతినిధి,సెప్టెంబర్ 4: (ప్రజా గళం)

2023 డిసెంబర్ 3న మీరు వేసిన ఒక్క ఓటు..10 ఏళ్ల దొరల పాలనకు చరమగీతం పాడింది అని,ప్రగతి భవ న్ ఇనుప గేట్లు బద్దలై,ప్రజా భవన్ తలుపులు తెరుచు కున్నాయని టిపిసిసి ప్రతినిధి గంగ శంకర్ స్పష్టం చేశారు.శుక్రవారం బోధన్ పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయ కులు,కార్యకర్తలు కేక్ కట్ చేసి విజయోత్సవ సంబురా లు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా గంగ శంకర్ మాట్లాడుతూ..ఈ 1000 రోజులు-ఇది లెక్కల పాలన కాదు,మనసున్న పాలన! అని అన్నారు.రైతన్న కళ్లల్లో ఆనందం చూడం డి,అప్పుల ఊబిలో కూరుకు పోయిన 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.2 లక్షల రుణమాఫీతో విముక్తి కల్పించామని అన్నారు.రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు సాయం,ఈ రోజు తెలంగా ణ రైతు పండించిన వరి,పంజాబ్ రైతును మించి దేశంలోనే నెంబర్-1 గా నిలబె ట్టామని పేర్కొన్నారు. అక్కాచెల్లెళ్లు,ఒకప్పుడు బస్ ఎక్కాలంటే భర్త చేతి వైపు చూసే మా ఆడబిడ్డ,ఈ రోజు మహాలక్ష్మి బస్సులో ఉచితంగా రాష్ట్రమంతా తిరుగుతోంది అని,గ్యాస్ ధర పెరిగిందని,పొయ్యి వెలిగించని తల్లి లేదు-రూ.500 కే సిలిండర్ ఇస్తున్నామని,నెల నెలా కరెంటు బిల్లుభయం లేదు,200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు.

పేదవాడి కడుపు నిండటం చూడండి,15 లక్షల కొత్త రేషన్ కార్డులు,దొడ్డు బియ్యం స్థానంలో,సన్న బియ్యం! 6 కిలోల చొప్పున ప్రతి పేదవాడికి ఇస్తున్నామని,4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి సొంతింటి కళ నెరవేర్చమని,ఇది ఇల్లు కాదు,ఆత్మగౌరవం అని గంగ శంకర్ స్పష్టం చేశారు.ఖాళీగా ఉన్న సచివాలయంలో ఉద్యోగాలు లేవు అన్నారు.1000 రోజుల్లో 72,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ప్రజా ప్రభుత్వానిది అని అన్నారు.డిఎస్ సి,గ్రూప్-1,పోలీస్ ఉద్యోగం,ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చామని పేర్కొన్నారు.70 ఏళ్లు గా ఎదురుచూసిన ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని, బిసి లకు 42% రిజర్వేషన్ కు చట్టం చేసి కేంద్రానికి పంపామని ఇది దామాషా ప్రకారం దక్కాల్సిన వాటా అని తెలిపారు.

ఇది కేవలం ఆరంభం మాత్రమే అని,మన లక్ష్యం,ఫ్యూ చర్ సిటీ,యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ,ప్రపం చ స్థాయి రోడ్లు,మూసీ పునరుజ్జీవనంకు చర్యలు చేపట్టామని,10 ఏళ్లు తెలంగాణను అమ్ముకున్నారు, 1000 రోజుల్లో తెలంగాణను నిలబెట్టాం!అని టి పిసిసి ప్రతినిధి గంగశంకర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి,పార్టీ పట్టణ అధ్యక్షులు అంకు దాము,నాయకులు పాషా మొయినుద్దీన్,నాగేశ్వర్ రావు,పలువురు కౌన్సిలర్ లు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.