బోధన్ ప్రతినిధి,సెప్టెంబర్ 7: (ప్రజా గళం)
బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలం మహంతం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి భవనం పై నుండి పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం..ధర్మాబాద్ మండలం డీగ్రస్ గ్రామానికి చెందిన వాగ్మారే యాదవ్ మహంతం గ్రామం లో ఒక భవనంపై కూలి పని చేస్తుండగా ఒకసారి గా పట్టు తప్పి కింద పడడంతో తీవ్ర గాయాలు కాగా స్థానికులు గమనించి నవీపేట్ ఆస్పత్రికి తరలించి ఆపై ఎడపల్లి 108 అంబులెన్సులో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన ఎడపల్లి 108 సిబ్బంది,ఈఎం టి.లక్ష్మణ్ పైలెట్ నరేష్ ను వైద్యులు అభినందించారు.

