నిజామాబాద్, సెప్టెంబర్ 11( ప్రజా గళం ప్రతినిధి )
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికీ 20 బ్లడ్ ప్రెజర్ అపరాటస్‌లను
మనోరమా హాస్పిటల్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డా. శిరిపల్లి శ్రీనివాస్ మానవతా దృక్పథంతో విరాళంగా అందించి సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఎల్. రాములు, డా. శిరిపల్లి శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలియజేసి, శాలువాతో సత్కరించారు.
ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలను విరాళంగా అందించడం ద్వారా రోగుల వైద్య సేవలకు తోడ్పాటు అందించిన డా. శిరిపల్లి శ్రీనివాస్ సేవలను ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం అభినందించింది.

