గ్రామాలలో భక్తి శ్రద్దలతో ఘనంగా ఎడ్ల పోలాల అమా వాస్య పండుగ వేడుకలు…. ఆలయాల చుట్టూ ఎడ్లతో ప్రదక్షిణ….

 

 

బోధన్ ప్రతినిధి,సెప్టెంబర్ 10: (ప్రజా గళం)

బోధన్ నియోజకవర్గంలోని గ్రామాలలో ఎడ్ల పోలాల అమావాస్య పండుగను గురువారం భక్తి శ్రద్దల మధ్య రైతులు,గ్రామస్తులు సంప్రదా యబద్ధంగా ఘనంగా నిర్వహిం చారు.వ్యవసాయంలో తమకు తోడుగా నిలి చే ఎడ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్థానిక హను మాన్ ఆలయాల చుట్టూ బసవన్నలతో ప్రదక్షిణ చేయిం చారు.గ్రామాల్లో ఎడ్లను అందంగా అలంకరించి పూజ లు నిర్వహించిన అనంతరం హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. మరికొన్ని గ్రామాల్లో ఎడ్లు లేకపోవడంతో వ్యవసాయానికి ప్రధాన ఆధారం గా మారిన ట్రాక్టర్లను శుభ్రం చేసి పసుపు, కుంకుమల తో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.